GANG RAPE ON PREGNANT WOMAN IN UP SHE DELIVERED DEATH BABY VY
Rape on pregnant woman : గర్భవతిని కూడా వదలని కామంధులు... మృత శిశువుకు జన్మ
Rape on pregnant woman : ఉత్తరప్రదేశ్లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. గర్భిణి అని కూడా చూడకుండా చిన్న ఘర్షణలో కక్ష్య పెంచుకుని సాముహిక అత్యాచారం చేశారు. దీంతో కడుపులో ఉన్న శిశువు మరణించింది.
[caption id="attachment_702172" align="alignnone" width="1200"] ఉత్తరాధి రాష్ట్రం యూపిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు కొంతమంది గర్భణి మహిళపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు గర్భాస్రావం కావడంతో పాటు కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది.
[/caption]
2/ 8
సీఎం యోగి అధిత్యానాథ్ తర్వాత ఉత్తర ప్రదేశ్లో అసంఘీక శక్తుల ఆట కట్టించడంలో సక్సెస్ అవుతున్నప్పటికి కొన్ని సంఘటనలు మాత్రం ఆ రాష్ట్రానికి మచ్చ తెస్తున్నాయి.. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు ఇంకా తగ్గని పరిస్థితి కనిపిస్తుంది..
3/ 8
ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్లోని ఔరైయా జిల్లా బియాపూర్ పోలీసు స్టేషన్పరిధిలోని అయిదు నెలల గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అత్యాచారానికి ముందు బాధిత మహిళతో అదే గ్రామానికి చెందిన వారితో డ్రయినేజ్ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ ప్రారంభమైందని , అయితే ఈ ఘర్షణతో బాధిత మహిళపై కక్ష పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
కాగా ఈ సంఘటన గత 28న బాధితురాలు ఇంటిబయటకు బహిర్భూమికి వచ్చిన నేపథ్యంలోనే ముగ్గురు వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఊరి చివర ఉన్న ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి సాముహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. (image: Reuters)
6/ 8
విషయం తెలిసిన గ్రామస్థులు మహిళను బంధించిన ఇంటికి వెళ్లి చూశారు. ఈ క్రమంలోనే ఆమె విగత జీవిగా పడి ఉంది. అయితే ఆమె అప్పటికే అయిదు నెలల గర్భవతి కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
7/ 8
అయితే బాధిత మహిళ చికిత్స పొందుతున్న సమయంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ సంఘటనపై కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆగ్రహంతో ఉండడంతో గ్రామంలో టెన్షన్ వాతవరణం నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
8/ 8
మహిళపై దారుణ అఘాయిత్యానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసకుంటున్నట్టు పోలీసులు చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష విధంగా చర్యలు చేపట్టాలని ఆందోళన కొనసాగుతుండడంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.