గుంటూరు జిల్లా యడ్లపాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది.
2/ 5
యడ్లపాడులో ప్రేమ్ చంద్, రవివర్మ అనే యువకులు ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు. ఈ క్రమంలో స్నేహితుల మధ్య విబేధాలు వచ్చాయి.
3/ 5
దీంతో ప్రేమ్ చంద్ ఓ ప్లాన్ వేశాడు. అమ్మాయి కోసం ఇద్దరం కలసి చనిపోదామని రవివర్మతో చెప్పాడు. ఆ విషయాన్ని రవివర్మ నమ్మేశాడు.
4/ 5
ప్రేమ్ చంద్ రవివర్మకు ఫోన్ చేసి మర్రిపాలెం రావాలని పిలిచాడు. అప్పటికే కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపాడు. తాను పురుగుల మందు ఉన్న కూల్ డ్రింక్ తాగేశానని, నీ వంతే మిగిలిందని చెప్పాడు.
5/ 5
ఆ విషయాన్ని నమ్మేసిన రవి వర్మ గడ్డి మందు కలిపిన ఆ కూల్ డ్రింక్ తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయాడు.