ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఇయర్ పార్టీ జరుపుకున్న ఓ ఫ్లైట్ అటెండెంట్ బాత్ టబ్‌లో శవమై కనిపించింది. అయితే ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఇయర్ పార్టీ జరుపుకున్న ఓ ఫ్లైట్ అటెండెంట్ బాత్ టబ్‌లో శవమై కనిపించింది. అయితే ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. (Image-Instagram-Christine Angelica Dacera)
2/ 8
వివరాలు.. క్రిస్టిన్ ఏంజెలికా డాసెరా అనే మహిళ ఫిలిఫిన్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకునేందుకు మకటి నగరంలోని సిటీ గార్డెన్ హోటల్‌కు వెళ్లింది. క్రిస్టన్‌తో పాటు ఆమె సహచర ఉద్యోగులు కూడా ఉన్నారు. (Image-Instagram-Christine Angelica Dacera)
3/ 8
ఇక, మరుసటి రోజు క్రిస్టన్ సహచర ఉద్యోగి రోమెల్ గాలిడా.. ఉదయం 10 గంటలకు లేచి చూసేసరికి ఆమె బాత్ టబ్ పడి ఉంది. అయితే నిద్రపోతుందని భావించిన గాలిడా.. ఆమెపై బ్లాంకెట్ కప్పి వచ్చి మళ్లీ నిద్ర పోయాడు.(Image-Instagram-Christine Angelica Dacera)
4/ 8
ఆ తర్వాత కొద్ది గంటలకు నిద్రలేచిన గాలిడా.. క్రిస్టిన్ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించాడు. ఆమె శరీరం నీలపు రంగులోకి మారడంతో ఆందోళన చెందాడు.(Image-Instagram-Christine Angelica Dacera)
5/ 8
దీంతో హోటల్ సిబ్బంది, మరికొందరు స్నేహితులతో కలిసి గాలిడా ఆమెను హాస్పిటల్‌కు తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు.(Image-Instagram-Christine Angelica Dacera)
6/ 8
క్రిస్టన్ జనవరి 1 సాయంత్రం 5 గంటలకు మరణించినట్టు వైద్యులు.. అక్కడి అధికారులుకు నివేదిక అందజేశారు. (Image-Instagram-Christine Angelica Dacera)
7/ 8
అయితే క్రిస్టిన్ ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం విచారణ అధికారులు ఎదురుచూస్తున్నారు.(Image-Instagram-Christine Angelica Dacera)
8/ 8
ఇక, హోటల్లో క్రిస్టిన్ పనిచేస్తున్న సంస్థ అద్దెకు తీసుకున్న ఓ రూమ్‌లో జరిగిన ప్రైవేట్ పార్టీలో దాదాపు 10 మంది పాల్గొనట్టుగా తెలుస్తోంది. (Image-Instagram-Christine Angelica Dacera)