స్కూల్ నుంచి వస్తున్న పిల్లలను ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. జాలోర్ లో స్కూల్ నుంచి వస్తున్న పిల్లలను ఓ కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. వారు స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు.