ప్రత్యూష ప్రముఖ హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు. మన సౌత్ ఇండియా లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ కి డ్రెస్ డిజైన్లు చేసింది..దీపికా పడుకునే, కీర్తి సురేష్,శృతి హాసన్,శ్రియ, తమన్నా, కాజల్ అగర్వాల్ ఇలా సౌత్ ఇండియా లో చక్రం తిప్పుతున్న స్టార్ హీరోయిన్స్ అందరికి డ్రెస్సులు డిజైన్లు చేసేది ప్రత్యుష.
డిజైనర్ ప్రత్యూష గరిమెల్లది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆధారాలు, బొటిక్ వాచ్‌మన్ వీరబాబు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిజైనర్ ప్రత్యూష ఈ నెల 10న తన బొటిక్‌లో కార్బన్ మోనాక్సైడ్ ద్వారా వచ్చిన విష వాయువుల వల్ల మరణించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.