Rohit Sharma Fan : కోహ్లీ, రోహిత్ లపై దూషణ.. ప్రాణ స్నేహితుడని కూడా చూడకుంగా అతి కిరాతకంగా మర్డర్.. ఎక్కడ జరిగిందంటే?
Rohit Sharma Fan : కోహ్లీ, రోహిత్ లపై దూషణ.. ప్రాణ స్నేహితుడని కూడా చూడకుంగా అతి కిరాతకంగా మర్డర్.. ఎక్కడ జరిగిందంటే?
Rohit Sharma Fan : ఈ సంఘటన తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడి మీడియా వివరాల ప్రకారం ఈ సంఘటన గత గురువారం చోటు చేసుకుంది. నిందితుడితో పాటు చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా మంచి స్నేహితులని తెలుస్తుంది.
తమిళనాడు రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తనకు ఆరాధ్య దైవాలుగా ఉన్న భారత క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లను దూషించాడనే కారణంతో ఓ అభిమాని తన ప్రాణ స్నేహితుడినే కిరాతకంగా మర్డర్ చేశాడు.
2/ 8
ఈ సంఘటన తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడి మీడియా వివరాల ప్రకారం ఈ సంఘటన గత గురువారం చోటు చేసుకుంది. నిందితుడితో పాటు చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా మంచి స్నేహితులని తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అక్కడి మీడియా వివరాల ప్రకారం మద్యం సేవించే సమయంలో వీరి మధ్య క్రికెట్ టాపిక్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బండ బూతులు తిట్టినట్లు తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
దాంతో ఆగ్రహించిన అభిమాని మద్యం మత్తులో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపేసినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (PC : TWITTER)
5/ 8
దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంపుకునేంత వెర్రి అభిమానం ఏంట్రా అంటూ కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు. (PC : TWITTER)
6/ 8
దేశంలో క్రికెట్ ను పిచ్చిగా ఆరాధిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియాకి కంటే కూడా వ్యక్తిగతంగా ప్రతి ప్లేయర్ కు లక్షల్లో అభిమానులు ఉంటారు.
7/ 8
తమ అభిమాన ప్లేయర్ గొప్ప అంటే తమ అభిమాన ప్లేయర్ గొప్ప అంటూ టీమిండియా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సర్వ సాదారణం. అయితే ఈ గొడవల్లో చాలా మటుకు మాటలతోనే ముగుస్తాయి.
8/ 8
కానీ తమిళనాడు సంఘటన మాత్రం సమాజం సిగ్గుపడేలా ఉంది. తన ఫేవరెట్ ప్లేయర్లను తిట్టాడన్న క్షణికావేశంలో మానవత్వం మరిచిన ఆ అభిమాని స్నేహితుడిని చంపి హంతకుడిగా మారాడు. (ప్రతీకాత్మక చిత్రం)