లలిత్పూర్: వివాహేతర సంబంధాల మూలాన కాపురాలు కూలిపోతున్న సంగతి తెలిసినా, రోజుకు ఎన్నో ఘటనలు వెలుగుచూస్తున్నా కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. దేహాల దాహాలు తీర్చుకునేందుకు, వ్యామోహాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తీరా.. విషయం బయటకు పొక్కే సరికి ఈ వ్యవహారం కాస్తా హత్యలతోనో, ఆత్మహత్యలతోనో ముగుస్తోంది. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకుంటే భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన వీడియోలను ఇన్నాళ్లూ చూసి ఉంటారు. కానీ.. ఈ ఘటన ఇందుకు పూర్తి భిన్నం.
భార్య వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసి ఆమెను, ఆమె ప్రియుడిని తన ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్తకు సంబంధించిన ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. లలిత్‌పూర్‌లోని వర్ణి జైన్ ఇంటర్ కాలేజీకి వెనుక వైపు ఉండే ఓ ఇంట్లో నివసించే మహిళ భర్తకు తెలియకుండా ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
కొన్ని నెలల నుంచి ఇద్దరూ భర్తకు తెలియకుండా ఒకరిని ఒకరు కలుస్తున్నారు. అయితే.. ఈ మధ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువకుడిని నేరుగా ఇంటికి పిలిపించుకుని మరీ ఆ వివాహిత రాసలీలలు సాగిస్తోంది. ఆ విషయం ఇరుగుపొరుగు వారికి తెలిసినా తెలియనట్టు ఉన్నారు. వాళ్ల కుటుంబ వ్యవహారం మనకెందుకన్న ధోరణిలో వాళ్లు మౌనంగా ఉన్నారు.
కానీ.. ఆ వివాహిత వీలు కుదిరినప్పుడల్లా, ఇంట్లో ఎవరూ లేని ప్రతిసారి ఇలానే చేస్తోంది. ఇటీవల కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ మహిళ తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని.. రావాలని చెప్పింది. ఆమె ప్రియుడు ఫోన్ చేసిన కాసేపటికే ఎప్పటిలా ఆమె ఇంట్లో వాలిపోయాడు. ఈసారి మాత్రం సదరు వివాహిత, ఆమె ప్రియుడు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారు. ఆమె ప్రియుడు ఇంట్లో ఉన్న సంగతి ఎవరో ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పారు.
వెంటనే తన స్నేహితులతో కలిసి ఇంటికి చేరుకున్న భర్త భార్యను, ఆమె ప్రియుడిని చెప్పుతో కొట్టి చితకబాదాడు. అడ్డంగా దొరికిపోయాక కూడా ఆ వివాహిత ఆమె ప్రియుడిని భర్త కొడుతుంటే కాపాడేందుకు ప్రయత్నించడం కొసమెరుపు. ఇంటికొచ్చి తన భార్యతో రాసలీలలు సాగిస్తున్న ఆ యువకుడిని ఆమె భర్త పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.