అయితే గుజరాత్ కు చెందిన కొందరు యువకులు ఐపీఎల్ ను మరోలా వాడుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు జరిగేటప్పుడు బెట్టింగ్ చేసి 100కు 1000 సంపాదించొచ్చంటూ రష్యన్లను మోసం చేసిన అందినకాడికి దోచుకున్నారు. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో వీరు ఫేక్ ఐపీఎల్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఫేక్ ఐపీఎల్ ను వీరు ఏ విధంగా ఏర్పాటు చేశారో తెలుసుకున్న నెటిజన్లు వీరి తెలివికి నీరాజనాలు పలుకుతున్నారు. (PC : TWITTER)
గుజరాత్‌లోని మెహ్సనా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు యూట్యూబ్ వేదికగా ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రతక్షప్రసారం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ,గుజరాత్ టైటాన్స్ ఇలా ఐపీఎల్ లో ఆడే టీంల జెర్సీలను జెర్సీలను కూలీలకు వేయించి వారిని ప్లేయర్లుగా మార్చేశారు. అంతటితో ఆగకుండా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే వాయిస్‌ని మిమిక్రీ చేస్తూ.. నిజమైన ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్న అనుభూతిని కలిగించారు. ఒక్కో మ్యాచ్‌లో ప్లేయర్లుగా నటించేందుకు కూలీ పని చేసేవాళ్లకు రోజుకు రూ.400 ఇచ్చి తీసుకొచ్చారు. (PC : TWITTER)
ఈ మ్యాచ్ లను చూసేందుకు జనాలు స్టేడియాలకు ఎగబడినట్లుగా గ్రాఫిక్స్ తో మేనేజ్ చేశారు. సౌండ్ సిస్టమ్, హాక్ ఐ ఇలా ఒక్కటేంటి ఐపీఎల్ టెక్నాలజి మొత్తాన్ని వీరు ఇందులో వాడేశారు. ఒకరకంగా చెప్పాలంటే వీరు ఐపీఎల్ ను ప్రతిసృష్టి చేశారు. ఇక ఈ గ్రూప్ లోని ప్రధాన వ్యక్తి షోయబ్ దేవ్డా రష్యాలోని పబ్ లకు వెళ్తూ వాళ్లకు ఐపీఎల్ క్రేజ్ గురించి తెలియజేశాడు. బెట్టింగ్ కాసి రాత్రికి రాత్రి లక్షల్లో డబ్బులు సంపాదించొచ్చు అంటూ నమ్మబలికాడు. దాంతో కొందరు రష్యన్లు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచ్ లపై బెట్టింగ్ లు కాశారు. (PC : TWITTER)