అహ్మదాబాద్లో దారుణం జరిగింది. తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన మాజీ భార్యను ఆమె మాజీ భర్త అత్యంత కిరాతకంగా హతమార్చాడు. 27 సార్లు ఆమెను పొడిచి మరీ చంపాడు. అతని దాడిలో గాయపడి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను వెంటాడి మరీ పొడిచి కిరాతకంగా చంపేశాడు. ఆమె రెండో పెళ్లి చేసుకున్న భర్త ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
భార్య దూరమైనప్పటి నుంచి అజయ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. మానసికంగా కుంగిపోయాడు. పిల్లలను ఎలా చూసుకోవాలో తెలియక మదనపడ్డాడు. ఈ క్రమంలోనే.. మద్యానికి బానిసయ్యాడు. తనకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల పాటు అవకాశం కోసం ఎదురుచూశాడు. ఆమెపై విపరీతమైన పగ పెంచుకున్నాడు.
రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న హేమను చూసి ఇంటికొచ్చిన ఆమె రెండో భర్త మహేష్ ఠాకూర్ నిర్ఘాంతపోయాడు. అజయ్ ఠాకూర్, అతని స్నేహితులు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో హేమ నివాసం ఉంటున్న వింజల్ క్రాసింగ్ సమీపంలోని సుఖ్ సాగర్ సొసైటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.