సిటీలోని ఓ లాడ్జికి కుర్రాళ్లు వచ్చి పోతుంటే... అక్కడి ఓ పాన్ షాపు దగ్గర కిళ్లి కట్టించుకునేందుకు వచ్చిన వ్యక్తికి డౌట్ వచ్చింది. ఆ లాడ్జికి ఎందుకు అంతమంది వస్తున్నారు అని పాన్ షాప్ అతన్ని అడిగితే... ఆ పక్కనే సిగరెట్ కాల్చుకుంటున్న మరో వ్యక్తి... నీ డౌట్ కరెక్టే... అక్కడ అదే జరుగుతోంది. పగలూ రాత్రి తేడా లేకుండా 24 గంటలూ అదే పని అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే ఆ కిళ్లీ కట్టించుకునే వ్యక్తి... పోలీసులకు కాల్ చేసి... విషయం చెప్పాడు. దాంతో పోలీసులు రైడింగ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రైడింగ్‌లో అబ్బాయిలు పారిపోగా... 5గురు అమ్మాయిలు దొరికారు. వీరంతా ఢిల్లీ, కోల్‌కతాకు చెందిన వారు. వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు... స్టేషన్‌కి తీసుకెళ్లి... అసలు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారని అడిగారు. తమను అనుజ్ షెవారీ, గురు జైన్ అనే ఇద్దరు కేటుగాళ్లు... ఈ వృత్తిలోకి దించారని అమ్మాయిలు చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
తనకో చెల్లి ఉందనీ... కుటుంబ భారాన్ని తాను చూడాల్సి వచ్చిందని చెప్పిన ఆ అమ్మాయి... దేశంలో కరోనా రావడంతో... ఏ పనీ దొరకలేదని చెప్పింది. దాంతో... తాను సెక్స్ రాకెట్లోకి డబ్బు కోసం వెళ్లానని చెప్పింది. ప్రతి అమ్మాయీ దాదాపు ఇలాంటి కథే చెప్పింది. కరోనా సోకినా వృత్తి కొనసాగించాల్సిందే అని కండీషన్ పెట్టారని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)