ఖమ్మం: ఆ యువతి వయసు 20 సంవత్సరాలు. ఈ మధ్యే పెళ్లి కూడా కుదిరింది. కోటి ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టాల్సిన ఆ యువతిని మృత్యువు కబళించింది. పెళ్లి మండపంలో వధువుగా కూర్చోవాల్సిన ఆమెను ఈలోకానికే దూరం చేసింది. ఖమ్మం జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీకి చెందిన కుంచాల వీరయ్య కుమార్తె వెంకటేశ్వరమ్మ. కూతురికి 20 ఏళ్లు రావడంతో ఆమెకు పెళ్లి చేయాలని తండ్రి వీరయ్య భావించాడు.
ఇటీవలే ఆమెకు ఓ మంచి సంబంధం చూసి వివాహం నిశ్చయించాడు. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టబోతోందని ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఇటీవల.. వరుడి కుటుంబం కూడా వీరయ్య ఇంటికి వచ్చి వెళ్లింది. రేపోమాపో ఇరు కుటుంబాలు కలిసి సుముహూర్తం నిర్ణయించాలని భావిస్తున్న తరుణంలో వీరయ్య కుమార్తె వెంకటేశ్వరమ్మ అనారోగ్యానికి లోనైంది.
కూతురికి పెళ్లి సంబంధం కుదుర్చుకుని.. పెళ్లికి ముహూర్తం పెట్టుకోవాలని భావిస్తున్న తరుణంలో వెంకటేశ్వరమ్మ చనిపోవడంతో వీరయ్య కుప్పకూలిపోయాడు. ‘ఎంతపని జరిగింది.. దేవుడా’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. ‘ఇరవై ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయా తల్లీ’ అని కూతురి మృతదేహంపై పడి వీరయ్య రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.