DAUGHTER ARRESTED FOR MURDER PLAN OF HER MOTHER WITH STEP FATHER MANY TWISTS IN STORY AK
Affair-Love-Murder: తల్లి హత్యకు మూడో భర్తతో కలిసి ప్లాన్.. స్టోరీలో ఎన్నో ట్విస్టులు
తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ కూతురుతో ఉండటంపై అర్చన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అయితే తల్లి హత్యకు అర్చన రెడ్డి కూతురు నవీన్ స్కెచ్ వేసినట్లు తేలింది.
అర్చన రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
2/ 7
నిన్న అర్చన మూడో భర్త నవీన్, అతని సహచరులు సంతోష్, అనూప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అర్చన రెడ్డి కూతురు ఆనంద, నరేంద్ర, దీపులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
3/ 7
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అర్చన రెడ్డి తన కొడుకుతో తిరిగి వస్తుండగా ఈ హత్య జరిగింది. తన మూడో భర్త నవీన్ తన సహచరులతో కలిసి కారును అడ్డగించి కొడుకు ముందే అర్చనను హత్య చేశాడు.
4/ 7
పెళ్లయిన పదేళ్ల తర్వాత అర్చన రెడ్డి తన భర్తకు విడాకులు ఇచ్చింది. అర్చనకు నవీన్ మూడో భర్త.
5/ 7
అర్చన రెడ్డి కుమార్తెకు జిమ్ ట్రైనర్‌గా ఉన్న నవీన్.. ఆ తర్వాత తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు సహజీవనం చేశారు. ఆ తర్వాత నవీన్ తన కూతురితో కలిసి వెళ్లడం అర్చన గమనించింది. ఈ విషయంలో నవీన్‌ను హెచ్చరించింది.
6/ 7
తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ కూతురుతో ఉండటంపై అర్చన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అయితే తల్లి హత్యకు అర్చన రెడ్డి కూతురు నవీన్ స్కెచ్ వేసినట్లు తేలింది.
7/ 7
చనిపోయిన అర్చన, నవీన్‌ల మధ్య ఆస్తి వివాదం ఉంది. తల్లి హత్యలో కూతురి ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో విచారణ జరగాల్సి ఉంది.