హైటెక్ సిటీ దగ్గర దొరికిన రూ.2 కోట్ల డబ్బు వ్యవహారంలో ఎంపీ మురళీమోహన్, ఎలమంచిలి మురళీ కృష్ణపై కేసు నమోదు చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.
రెండు బ్యాగులను చెక్ చెయ్యగా... రూ.2 కోట్లు దొరికాయని వివరించారు. రూ.96 లక్షల వరకూ 500 రూపాయల నోట్లు... మిగతావి 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు తెలిపారు.
. ఈ కేసులో నిమ్మలూరి శ్రీహరి, అవుటి పండరి, ధర్మరాజు, జగన్ మోహన్‌లపై కేసు నమోదు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. వీళ్లంతా గచ్చిబౌలిలోని జయభేరీ ప్రాపర్టీస్‌లో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.
హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ దగ్గర శ్రీహరి, పండరిలు... తమకు ఆ డబ్బును జయభేరీ ప్రాపర్టీస్‌లో పనిచేస్తున్న ధర్మరాజు, జగన్మోహన్ ఇచ్చారని వెల్లడించారు
డబ్బును రాజమండ్రికి తీసుకెళ్తే... అక్కడ ఎలమంచిలి మురళీ కృష్ణ కారులో వచ్చి డబ్బును తీసుకుంటారనీ... ఆయన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌కు ఆ డబ్బు ఇస్తారని పోలీసుల దర్యాప్తులో నిందితులు తెలిపారు.
పోలీసులు ఎంపీ మురళీమోహన్, ఎలమంచిలి మురళీ కృష్ణపై కేసు నమోదు చేశారు. డబ్బు సీజ్ చేసిన పోలీసులు... మొత్తం ఆరుగురిపై మాధాపూర్ పోలీస్ స్టేషన్‌సో కేసు నమోదు చేశారు.