డబ్బులు ఊరికే రావని అని ఎంత చెప్పినా ఈ జనం పట్టించుకోరు. మనిషి అత్యాశే అతడి పాలిట శాపమని తెలుసుకోరు. కొందరు కష్టపడి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. మరికొందరు కష్టపడకుండానే ఎక్కుడ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్లు.. డబ్బు డబుల్ అవుతుందంటే, ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తారు. నిండా మునిగాక లబోదిబోమంటారు.
బాధితుడు పోగొట్టుకున్న సొమ్ము ఫోన్‌పైసా అనే సంస్థ ఖాతాకు చేరినట్లు గుర్తించారు. అక్కడి నుంచి గేమ్‌కింగ్ 567 సంస్థ నిర్వహించే వేర్వేరు ఖాతాలకు బదిలీ అయ్యాయి. రూ.87 లక్షలు ఏయే ఖాతాలకు బదిలీ అయ్యిందో సమాచారం ఇవ్వాలని ఫోన్‌పైసా సంస్థకు మెయిల్ చేసినట్లు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు.
ఐటీ చట్టం, తెలంగాణ గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ గేమ్స్‌పై రాష్ట్రంలో నిషేధం ఉంది. ఈ ఘటనపై బాధితుడు తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పొగొట్టుకున్న డబ్బును ఎలాగైనా రికవరీ చేసి తమకు ఇప్పించాలని పోలీసుల్ని కోరారు.
మరోవైపు సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త పంథాలు అవలంభిస్తూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను సైతం మోసం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు వేగంగా పెరిగాయి. 2021తో పోల్చితే హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు 8.8 శాతం పెరిగాయని గణంకాల ద్వారా తెలుస్తోంది.హైదరాబాద్ నగరంలో 2021లో 21998 నేరాలు నమోదు కాగా అవి 2022 చివరి నాటికి 22060కు పెరిగాయి. సైబర్ నేరాలు ఏకంగా 8.8 శాతం పెరిగాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
హత్యలు, నరహత్యలు, హత్యాయత్నాలు, ఘోరంగా గాయాలు చేయడం, సాధారణ గాయాలు, కిడ్నాప్ లు, అల్లర్ల సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2.2 శాతం పెరిగాయని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ తరహా నేరాలు 2021లో 2133 నమోదుగా కాగా, అవి 2022లో 2181కి పెరిగాయి. వీటిలో 368 తీవ్రమైన హత్యా నేరాలు ఉన్నాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో ఆస్తి వివాదాల నేరాల సంఖ్య 28 శాతం పెరిగాయి. ఆస్తి వివాదాలు హత్యలు, దోపిడీలు, ఇళ్లపై దాడులు చేయడానికి దారితీస్తున్నాయి. చైన్ స్నాచింగ్, దొంగ పోలీస్ వేషాలు, దృష్టి మరల్చడం, ఆటోమొబైల్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు, పనిమనుషులగా చేరి దొంగతనాలకు పాల్పడటంలాంటి మోసాలు 28 శాతం పెరిగాయి. ఇలాంటి నేరాలు 2021లో మొత్తం ఆస్తి నేరాలు 2417 నమోదుగా కాగా, 2022లో 3094కు పెరిగాయని సీవీ ఆనంద్ తెలిపారు.
పోలీసుల ప్రత్యేక దృష్టి సారించడంతో మహిళలు, పిల్లలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2021తో పోల్చుకుంటే 2022లో మహిళలపై నేరాలు 4 శాతం తగ్గాయి. పిల్లలపై నేరాలు 12 శాతం తగ్గాయి. 2022లో మహిళలపై 2524 నేరాలు నమోదు కాగా, 2021లో 2652 నమోదు అయ్యాయి. చిన్నారులపై నేరాలు 2021లో 399 నుంచి 2022లో 350కి తగ్గాలయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఫిషింగ్, ఓటీపీ మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు, క్రిప్టో కరెన్సీ నేరాలు, లోన్ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడటం, డార్క్ వెబ్ నేరాలు వేగంగా పెరిగిపోయాయి. ఈ నేరాలను అదపు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టూల్స్ తో పాటు సిబ్బందికి శిక్షణ అందిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 2021లో 2066 సైబర్ నేరాలు నమోదుకాగా, 2022నాటికి అవి 2249కి పెరిగాయి