జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసిన మరిది ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేశాడు. ఆస్తి తగాదాల కారణంగా వదినపై పగ పెంచుకున్న మరిది ఆమె పరువు తీయాలనే దురుద్దేశంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలిసింది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. ఆస్తి విషయంలో తగాదాలకు వదినే కారణమని భావించిన గోపి ఆమె పరువు తీయాలని ప్లాన్ చేశాడు. ఆమె స్నానం చేస్తుండగా సీక్రెట్‌గా మొబైల్‌తో వీడియో తీశాడు. సంవత్సరం క్రితమే ఆమె వీడియో తీసినప్పటికీ ఇటీవల బాధితురాలి భర్త ఓ కేసులో జైలుకు వెళ్లడంతో వదినను మరిది వేధించడం మొదలుపెట్టాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసిన గోపీని అరెస్ట్ చేశారు.
అయితే.. కోర్టు ఈ కేసులో గోపీకి బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన గోపీ వదినపై మరింత పగ పెంచుకున్నాడు. తనకు రూ.50 వేలు ఇవ్వాలని లేకపోతే వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి వైరల్ చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఈ బెదిరింపులను ఆమె లెక్కచేయకపోవడంతో గోపి అన్నంత పని చేశాడు. దీంతో.. సోషల్ మీడియాలో బాధితురాలి వీడియో వైరల్‌గా మారింది.