Suicide :ఆదివారం మధ్యాహ్నం పెళ్లి జరిగింది.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు..పెళ్లికి వచ్చిన బంధువులతో సందడి చేశాడు.. అందరు ఆశీర్వదించి ఇంటికిపోయాక..నూతన వధువు,వరుడు కలిసి ఒకే గదిలో నిద్రించేందుకు వెళ్లారు...కాని తెల్లవారుజామున పెళ్లి కూతురు వచ్చి మీ కొడుకు కనిపించడం లేదు అంటూ.. రెండు మాటలు అత్తమామలతో చెప్పింది.. తీర వెళ్లి చూస్తే పక్కగదిలో వరుడు ఉరివేసుకుని కనిపించాడు.
ఈ దారుణ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని వడ్డెపల్లి మండలం తనగలకు చెందిన సూర్యబాబు, అయిజ మండలం సంకాపురానికి చెందిన యువతికి ఆదివారం మధ్యాహ్నం పెళ్లి జరిగింది.
2/ 5
అయితే అదే రోజు రాత్రి పెళ్లి పనులు అన్ని పోయాక వధువు, వరుడు ఇద్దరు ఒకే గదిలో నిద్రించేందుకు వెళ్లారు..అప్పుడు అంతా బాగానే ఉన్నా.. రాత్రిపూట ఏం జరిగిందో తెలియదు..దీంతో ఉదయం నాలుగు గంటలకు పెళ్లికూతురు వచ్చి, మీ కొడుకు కనిపించడం లేదు అంటూ అత్తమామలకు చెప్పింది.
3/ 5
వారు వెతకడంతో పక్క గదిలో సూర్యబాబు..ఉరివేసుకుని కనిపించాడు.. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది..
4/ 5
ఆమె కుటుంబ సభ్యులు ఓ కారులో రావడంతో పెళ్లి కూతురు ,తాళి, మట్టెలు, తీసి తన వారితో పుట్టింటికి వెళ్లింది. దీంతో అనుమానం వచ్చిన సూర్యబాబు కుటుంబ సభ్యులు స్థానిక శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
5/ 5
పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వధువుతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం తరలించి..సోమవారం రాత్రి దహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నట్టు పోలీసులు తెలిపారు.