ప్రేమ, రొమాన్స్ లో కొన్ని నెలలు మునిగి తేలారు కైల్, నికోల్ లు. ఆ తర్వాతే కైల్ అసలు నిజ స్వరూపం బయటపడింది. ఇతర అబ్బాయిలతో నికోల్ మాట్లాడితే అసలు సహించేవాడు కాదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని టార్చర్ చేసేవాడు. అప్పుడప్పుడూ ఆ అమ్మాయిని కొట్టేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సారీ చెప్పి.. వేరే అబ్బాయిలతో మాట్లాడొద్దని బతిమాలాడేవాడు.