ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఆమె భర్త గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంది. అతనికి అంతకు ముందే పెళ్లైందని తెలిసినా సర్దుకుపోదామనుకుంది. కానీ.. కొద్దికాలంగా భర్త వికృత రూపం చూపించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్త మామలు వేధించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు ఆమె తట్టుకోలేక పోయింది. ఆ సమయంలో.. ఆమెకు మరిది బాసటగా నిలిచాడు.
చక్‌జైనా గ్రామానికి చెందిన రాకేష్‌ను షబ్నం కుమారి ఏడాది క్రితం వివాహం చేసుకుంది. అయితే అప్పటికే రాకేష్‌కు మరో మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న షబ్నం.. రాకేష్‌తో గొడవపడేది. మొదటి వివాహం గురించి షబ్నం గొడవ చేయడంతో ఆగ్రహం చెందిన రాకేష్, అతని తల్లి, తండ్రి కట్నం గురించి అడగడం మొదలుపెట్టారు.
అదనపు కట్నం తీసుకు రమ్మని వేధించడం ప్రారంభించారు. అలాంటి సమయంలో షబ్నంకు రాకేష్ సోదరుడు కుందన్ కుమార్ బాసటగా నిలిచాడు. వదినకు మద్దతు పలుకుతూ తల్లిని, తండ్రిని ఎదురించేవాడు. ఆ క్రమంలో కుందన్, షబ్నం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం రాకేష్‌కు తెలియడంతో కుందన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి వేరే ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా షబ్నం అక్కడకు వెళ్లేది.