కొన్ని ఘటనలు వింటుంటే.. పాఠశాలకు పిల్లలకు పంపించాలన్నా భయమేస్తుంటుంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు.. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా మానవ మృగాళ్లలాగా ప్రవర్తిస్తుంటారు. స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు. టీచర్ అంటే దేవుడితో సమానం అంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. (ప్రతీకాత్మక చిత్రం)
అందుకే టీచర్ అన్నా ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. అయితే కొందరు టీచర్లు తప్పుదోవ పడుతున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధించి దిగజారిపోతున్నారు. ఇటువంటి ఘటన ఒకటి బిహార్ లో చోటుచేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి ఒడిగట్టాడు. విద్యార్థిని బుగ్గ కొరికాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. (ప్రతీకాత్మక చిత్రం)
బిహార్లోని కటిహార్ జిల్లాలో ఒక మైనర్ విద్యార్థిని వేధింపులకు గురిచేసినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆ గ్రామ ప్రజలు దారుణంగా కొట్టారు. పిప్రి బహిర్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల అమ్మాయి స్కూల్ కి వెళ్తుండేది. ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించి బుగ్గ కొరికాడు. (ప్రతీకాత్మక చిత్రం)