కొందరు చాక్లెట్ ఇస్తామని చెప్పి, మరికొందరు బైక్ పై తీసుకెళ్లి అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఎక్కువగా అత్యాచార బాధితులలో తెలిసిన వారి చేతుల్లోనే మోసాలకు గురౌతున్నారు. ఆఫీసుల్లో తోటి ఉద్యోగుల చేతిలో మహిళలు వేధింపులు గురౌతున్నారు. కొన్ని చోట్ల చట్టాలను కాపాడాల్సిన అధికారులు కూడా నీచానికి తెగబడుతున్నారు.
బీహర్ లోని గయాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. రామరుచి గర్ల్స్ ఇంటర్స్కూల్కు చెందిన విద్యార్థుల బృందం గతంలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు అటెంట్ అవ్వడానికి మేజీస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని తిరిగి పాఠశాలకు వస్తున్నారు. ఇంతలో ఉపాధ్యాయుడు మద్యం సేవించాడు.
విద్యార్థినుల దగ్గరకు చేరి.. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. టీచర్ ను కూడా వేధించాడు. అత్యాచరం చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే.. అక్కడ ఉన్న విద్యార్థినులు.. ఉపాధ్యాయుడిని ప్రతిఘటించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.
దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.