Actress Srabanti: ప్రముఖ హీరోయిన్‌పై కేసు నమోదు.. అలా చేయడం తప్పని తెలీదట!
Actress Srabanti: ప్రముఖ హీరోయిన్‌పై కేసు నమోదు.. అలా చేయడం తప్పని తెలీదట!
తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పు తప్పే. ఈ విషయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఒకటే రూల్. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే అవకాశం బడాబాబులకు ఎప్పుడూ ఉంటుంది. అయితే, పబ్లిక్‌గా చేసిన పని నిజంగా తప్పని తెలీక తిప్పలు ఎదుర్కొంటోంది ప్రముఖ హీరోయిన్, మాజీ జర్నలిస్టు స్రవంతి. ఆమెపై నమోదైన కేసు వివరాలివే..
మాజీ జర్నలిస్టు, మాజీ బీజేపీ నాయకురాలు, ప్రముఖ బెంగాలీ నటి స్రవంతి ఛటర్జీ(స్రబంతి ఛటర్జీ) చిక్కుల్లో పడ్డారు. తెలియక చేశానని ఆమె చేబుతోన్న ఓ పనికి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
2/ 8
జర్నలిజం, పొలిటికల్ కెరీర్ కొనసాగించలేకున్నా బెంగాలీ సినిమాల్లో తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది స్రవంతి ముఖర్జీ. ఆమెపై ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది.
3/ 8
గొలుసుతో కట్టేసి ఉన్న ముంగిసతో ఫోటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్రవంతి ముఖర్జీ. ఆ ఫొటోలు వైరల్ కావడం, అందులో ముంగీసను చైన్ తో కట్టేసి ఉండటంతో వివాదం రాజుకుంది. ఇది కచ్చితంగా జీవహింసేననే విమర్శలు వెల్లువెత్తాయి. నటి స్రవంతిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
4/ 8
వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్లు 9, 11, 39, 48ఏ, 49, 49ఏ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించి జంతువులను అక్రమంగా పట్టుకోవడం, రవాణా చేయడం, స్వాధీనం చేసుకున్నందుకు స్రవంతి ఛటర్జీపై కేసులు నమోదు చేశారు అధికారులు.
5/ 8
కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ సెల్, డేటా మేనేజ్మెంట్ యూనిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని స్రవంతికి నోటీసులు పంపారు. అయితే వ్యన్య ప్రాణుల సంరక్షణ చట్టం గురించి తనకు అంతగా తెలియదని ఆమె అధికారులకు వివరించినట్లు తెలిసింది.
6/ 8
చైన్లతో కట్టేసి ఉన్న ముంగీసను పట్టుకోవడం, ఫొటోలు దిగడం తప్పని తెలీక ఇలా చేశానని స్రవంతి చెబుతోంది. త్వరలోనే అధికారులను కలిసి సమగ్ర వివరణ ఇస్తామని హీరోయిన్ వ్యక్తిగత న్యాయవాది ఎస్కే హబీబ్ ఉద్దీన్ తెలిపారు.
7/ 8
ఈ కేసు గురించి ఓ సీనియర్ అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణులను బంధించడం ఒక్కటే నేరం కాదు, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల ఇతరులు తప్పులు చేసే అవకాశం ఉందన్నారు.
8/ 8
జీవరాశులను ఏ రకంగానూ హింసించవద్దనే చట్టంపై అవగాహన పెరగాల్సి ఉందన్నారు అధికారులు. హీరోయిన్ స్రవంతిపై కేసుకు అది కూడా ఓ కారణమేనట. కేసు దర్యాప్తుకు ఆమె సహకరించి, వన్యప్రాణుల సంరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్తతుగా నిలవావాలని అధికారులు కోరారు.