ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. సోషల్ మీడియా మత్తులో పడి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల సంగతి అటుంచితే యువతీ యువకులు సులభంగా సోషల్ మీడియా ద్వారా బాధితులవుతున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన.
ఇంత దారుణాన్ని పన్నెండేళ్ల పిల్లవాడు చేశాడంటే ఎవరికీ నమ్మబుద్ధికాలేదు. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పనివేళలూ ఎక్కువే. పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని స్మార్ట్‌ఫోన్, గేమ్స్ ఆడుకోవడానికి ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశారు. రవి స్కూల్ టైమ్ అయిపోగానే వాటిని ముందేసుకునేవాడు. పెద్దవాళ్లు కూడా పిల్లవాడు తమను విసిగించుకుండా ఖాళీ సమయంలో సద్వినియోగం చేసుకుంటున్నాడని అనుకున్నారు. డిజిటల్ గేమ్స్ వల్ల మెదడు కూడా చురుకుగా మారుతుందని భావించారు.
అయితే, గేమ్‌లో భాగంగా ఆన్లైన్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో భాగస్థుడయ్యాడు రవి. ‘ట్రూత్ అండ్ డేర్’ గేమ్‌లో భాగంగా టీనేజర్లు ఒక్కో సాహసక్రియకు పూనుకోవాలనేది ఛాలెంజ్. అందులో ఎవరికి ఏ ఛాలెంజ్ వస్తే దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో భాగంగా టీనేజర్లు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి, వీడియోలను షేర్ చేసుకుంటూ వస్తున్నారని తెలిసింది. ఇలాంటి పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పుడు నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చీటికి మాటికి చేతికి ఫోన్ ఇచ్చి పిల్లల్ని పాడు చేయెద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.