Annam seva foundation: అనాథ శవాలకు ఆత్మబంధువై.. చితికిపోయిన దేహాలను చితిదాకా చేర్చడంలో ముందుంటున్న 16 ఏళ్ల అమ్మాయి..

Annam seva foundation: రైలుపట్టాలపై ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మృతదేహాన్ని చూడాలంటేనే మనకు ధైర్యం సరిపోదు. అలాంటిది చెల్లాచెదురుగా పడిఉన్న ఆ అవయవాలను ఒకచోటికి చేర్చి అంత్యక్రియలు జరపాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం ఓ 16 ఏళ్ల అమ్మాయికి ఉందని నిరూపించింది శ్రీ దేవి. రైలుపట్టాలపై పడి ఉన్న అనాథశవాలకు ఆత్మబంధువై అంత్యక్రియలు చేస్తోంది.