ఖుర్దా, కేంద్రాపడా, జగత్సింఘ్పూర్ జిల్లాల్లో 6 ప్రదేశాలలో కబితా ఆస్తులపై ఏకకాలంలో అధికారులు సోదాలు జరిపారు. సోదాలు జరిపిన వారిలో 10 మంది డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఆమె 4 భవనాలు, 10 ఇళ్ల స్థలాలు, విలాసవంతమైన కారు, విలువైన బంగారు ఆభరణాలను కలిగి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆమె బిల్డింగ్స్‌లో 4 అంతస్తుల భవనం ఒకటి, 3 అంతస్తుల భవనం మరొకటి, 2 రెండంతస్తుల భవనాలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
జగత్సింఘ్పూర్ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉండగా, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు, పలు స్థిర చరాస్తులు ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల దాడిలో గుర్తించారు. వీటి మొత్తం విలువ 4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, కబితాను పోలీసులు అరెస్ట్ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)