Andhra Pradesh: అత్యాచారం నుంచి యువతిని కాపాడిన పెంపుడు కుక్క.. భలే తెలివైనది.. అసలేం జరిగిందంటే..
Andhra Pradesh: అత్యాచారం నుంచి యువతిని కాపాడిన పెంపుడు కుక్క.. భలే తెలివైనది.. అసలేం జరిగిందంటే..
కుక్కలకు విశ్వాసం ఎక్కువ అంటారు. అందుకే చాలా మంది కుక్కలను ఇష్టపడతారు. కొందరు కుక్కలను ఇళ్లలో పెంచుకోవడమే కాకుండా.. వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు.
కుక్కలకు విశ్వాసం ఎక్కువ అంటారు. అందుకే చాలా మంది కుక్కలను ఇష్టపడతారు. కొందరు కుక్కలను ఇళ్లలో పెంచుకోవడమే కాకుండా.. వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. తాజాగా మనుషుల పట్ల కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో మరోసారి నిరూపితమైంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఓ పెంపుడు కుక్క 17 ఏళ్ల బాలికను అత్యాచారం బారి నుంచి కాపాడింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొల్లపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
వివరాలు.. గ్రామానికి చెందిన యువతి బుధవారం రాత్రి టెర్రస్‌పై నిద్రిస్తున్న సమయంలో.. అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ వ్యక్తి అలా చేయడంతో షాక్ తిన్న యువతి సాయం కోసం కేకలు వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
దీంతో వెంటనే ఆ ఇంట్లోని పెంపుడు కుక్క అక్కడికి చేరుకుంది. నిందితుడిపై దాడి చేసి.. అతడిని కరిచింది. ఇక, ఆ కాసేపటికే అప్రమత్తమైన చుట్టుపక్కలు వారు అక్కడికి చేరుకున్నారు. అయితే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గురువారం ఉదయం పెనుమూరు మండలం బస్టాండ్ ప్రాంతంలో బస్సు కోసం వేచి చూస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)