భార్య మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకున్న భర్త ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యతో పాటు, ఆమె ప్రియుడిపై దాడి చేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని గోనేగండ్లలోని లక్ష్మీపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొన్నాళ్లుగా బజారీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
దీంతో నాగరాజు.. భార్యతోపాటుగా, ఆమె ప్రియుడిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఉరుకుందమ్మ, బజారీలపై నాగరాజు దాడి చేశాడు. కత్తితో పొడి, బండరాళ్లతో వారిపై దాడికి పాల్పడ్డాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ దాడిలో బజారీ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉరుకుందమ్మకు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు అక్రమ సంబంధమే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)