చికాగోలోని సబర్బ్ లో కవాతు జరగుతుండగా, ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడి వారు భయంతో పరుగులు పెట్టారు. మరికొందరు తూటాబారిన పడ్డారు. దుండగుడు ఒక దుకాణంపై నిలబడి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. వీధుల్లో కాల్పులు చెలరేగడంతో పరేడ్లో పాల్గొన్నవారు అకస్మాత్తుగా భయంతో పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది.