ఆమె ఆత్మహత్య వెనుక ఆమె మామ ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.ఎల్లిస్బ్రిడ్జ్ ప్రాంతంలోని భూదార్పురాలో నివసిస్తున్న చందు భాయ్ పర్మార్ గ్యారేజీ లో పని చేస్తున్నాడు. అతని కుమార్తె ఆర్తికి ఐదేళ్ల క్రితం ఆరవల్లికి చెందిన విష్ణుతో వివాహం జరిగింది. అయితే ఆర్తిని ఆమె మామ దినేష్ ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్తి డెలివరీ కోసం పుట్టింటికి వచ్చినప్పుడు వివాహేతర సంబంధం గురించి బలవంతం చేశాడు.
ఆమె అందుకు నిరాకరించింది. డెలివరీ తరువాత పిల్లలతో కలిసి భర్త దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ విషయం తెలుసుకున్న దినేష్ కూడా అహ్మదాబాద్ వెళ్లి ఆర్తి ఇంటికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం, ఆర్తి ఇంటికి వచ్చిన దినేష్ ఆర్తిని బలవంతంగా వాకింగ్ కి తీసుకెళ్ళాడు. భర్తను, తండ్రిని చంపేస్తానని బెదిరించడంతో ఆమె దినేష్ తో కలిసి వాకింగ్ కు బయలుదేరింది. ఆ విషయం ఆర్తి భర్త విష్ణుకు తెలియడంతో తన మామ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.