Honey Trap: ఫేస్బుక్లో మీకు రకరకాల వ్యక్తులు తగులుతుంటారు. అపరిచితులు ఫ్రెండ్షిప్ రిక్వెస్టులు పంపిస్తుంటారు. చాలా మంది అబ్బాయిలు... అమ్మాయిల నుంచి రిక్వెస్ట్ రాగానే... ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే యాక్సెప్ట్ చేసేస్తుంటారు. ఓ ఇద్దరు హనీ ట్రాప్ ప్లాన్ వేశారు. ఈ కేసును డీల్ చేసిన గుజరాత్.. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు... ఇద్దర్ని అరెస్టు చేశారు.
ఆ తర్వాత పోర్నోగ్రఫీ సైట్ల నుంచి సేకరించిన కొంత మంది అమ్మాయిల నగ్న ఫొటోలు అతనికి పంపారు. ఒక్కో అమ్మాయితోనూ డేటింగ్‌కి ఇంత రేటు అని ఫిక్స్ చేశారు. ఎవరు కావాలన్నా ముందుగా... కొద్దిగా అడ్వాన్స్ ఇవ్వాలనీ... అడ్వాన్స్ ఇచ్చాక... అమ్మాయిని డైరెక్టుగా కలిసేలా ఏర్పాట్లు చేస్తామని... ఆ తర్వాత ఎంత ఆఫరో మాట్లాడుకోవచ్చని డీల్ మొదలుపెట్టారు.
అతను డీల్ మాట్లాడటం మొదలుపెడితే... అతను చేసిన చాటింగ్ డేటాని సేవ్ చేసి... దాని ద్వారా అతన్ని బ్లాక్ మెయిల్ చెయ్యాలన్నది వాళ్ల ప్లాన్. చాటింగ్ డేటాను బయటపెట్టకుండా ఉండాలంటే... డబ్బు ఇవ్వాలని డిమాండ్ చెయ్యాలన్నది వాళ్ల ప్లాన్. ఆ యువకుడు తెలివైన వాడు. వీళ్లతో ఏమీ తెలియని వాడిలా నటిస్తూ... మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్లు ఇంటర్నెట్ ఐపీ అడ్రెస్ ద్వారా ఎవరు ఇదంతా చేస్తున్నారో కనిపెట్టారు. ఇద్దర్నీ అరెస్టు చేసి... వారి మొబైల్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, వేర్వేరు బ్యాంకుల పాస్‌బుక్‌లూ సీజ్ చేశారు. పోలీసుల డౌట్ ఏంటంటే... వీళ్లు చాలా కాలం నుంచి ఇలా చేస్తున్నారు. ఇంతకు ముందు ఎంత మందిని టార్గెట్ చేశారో త్వరలోనే తేలుతుందని పోలీసులు తెలిపారు.