అసలు వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతానికి చెందిన యువకుడు పాదరక్షల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో అతనికి వివాహం నిశ్చయం అయ్యింది. పది రోజుల క్రింత ఆ అమ్మాయితో యువకుడికి వివాహం కూడా జరిగింది. అయితే, పైళ్లైన పది రోజుల తరువాత వధువుకు అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు ఆమెను పరీక్షించగా.. షాకింగ్ విషయం తెలిసింది. అదే విషయాన్ని యువతిని పెళ్లి చేసుకున్న యువకుడికి చెప్పగా.. అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయ్యింది. యువతి 8 నెలల గర్భవతి అని వైద్యులు చల్లగా చెప్పి వెళ్లారు. దాంతో ఆ యువకుడు బిత్తరపోయాడు. పెళ్లై పది రోజులు కూడా కాలేదు.. 8 నెలల గర్భవతి ఏంటి? అంటూ గిర్రున తిరిగి పడ్డాడు.
వరుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. వధువు గర్భవతి కావడానికి వరుడు కారణమా? మరో వ్యక్తి కారణమా అని తేల్చేందుకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వైద్య పరీక్షల అనంతరం నిజానిజాలేంటి అనేది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.