హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని కేబీఆర్ పార్కులో సినీ నటి షాలూ చౌరాసియాపై గతేడాది నవంబర్ లో అనూహ్య దాడి జరగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వాకింగ్, జాగింగ్ చేసే ప్రాంతం కావడంతో కేబీఆర్ పార్కులో దాడి ఘటన సంచలనం రేపింది. ఘటన జరిగిన ఐదు రోజుల్లోనే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.