కోల్ కతా బుక్ ఫెయిర్ లో పర్సులు కొట్టేస్తూ దొరికిపోయిన నటి రూపా దత్తా ఒక్కరే ఈ పని చేశారా, ఇంకెవరైనా సహకరించారా? ఇదేమైనా గ్యాంగా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం కావడంతో రూపా దత్తా రిమాండ్ కోసం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంత పేరుప్రఖ్యాతలు, రాజకీయ పలుకుబడి ఉండి ఇలాంటి పనులు చేయడమేంటని రూపా దత్తాపై విమర్శలు వస్తున్నాయి.