కొత్త పార్టీ ఆవిష్కరణ సభకోసం ఖమ్మం వెళ్తున్న వైఎస్ షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మంలో సాయంత్రం 5 గంటలకు వైఎస్ షర్మిల సంకల్ప సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచి ఖమ్మం సభకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు.అయితే, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల ఖమ్మం చేరుకోవాల్సి ఉంది. ఇవాళ జరిగే సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదించనున్నారు.