పుణెలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగంలో చేరాల్సి ఉంది. మంచి జీతం, కళ్ల ముందు అందమైన జీవితం. కూతురు ఉద్యోగం సాధించడంతో ఎంతో సంతోషించిన ఐశ్వర్య తల్లిదండ్రులు ఆమెను పుణెకు పంపారు. ఆమెతో పాటు అదే కళాశాలలో చదువుతున్న మరికొంత మంది విద్యార్థినులు కూడా పుణెలో ఉద్యోగం సాధించారు. వాళ్లతో కలిసి ఆగస్ట్ 25న ఐశ్వర్య పుణెకు వెళ్లింది. అయితే.. ఆమె అక్కడికి వెళ్లిన రోజే అస్వస్థతకు గురైంది.