దాంతో తండ్రి పేరు మీద ఉన్న పాలసీలు, బ్యాంకు ఖాతా వివరాలను కమల్ పరిశీలించాడు. వాటన్నింటిలోనూ నామినీగా గాయత్రి పేరు కనిపించడంతో షాకయ్యాడు. వెంటనే ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. తనకు రూ.80 లక్షలు ఇవ్వకపోతే నీ తండ్రికి సంబంధించిన వీడియోలను బయటపెడతానని బెదిరించింది. దీంతో కమల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.