గుజరాత్‌లోని... ఓ హోటల్లో 2 నెలలుగా అత్యాచారానికి బలవుతున్న ఓ యువతిని పోలీసులు రక్షించారు. అసలేమైందంటే... 16 ఏళ్ల ఓ యువతి... ఉద్యోగం కోసం వెతుక్కుంటోంది. ఆ సమయంలో... ఆమెకు సంతోష్ కుమార్ అనే వ్యక్తి తగిలాడు. నెలకు రూ.20వేలు ఇచ్చే మంచి ఉద్యోగం ఉందనీ... పెద్దగా చదువు అవసరం లేదని చెప్పాడు. హోటల్‌కి వచ్చే కస్టమర్లతో మాట్లాడి... వారికి తగిన రూం చూపించడమే ఉద్యోగం అని చెప్పాడు. నిజమే అనుకున్న యువతి... అతనితో వెళ్లింది. ఓ హోటల్‌కి తీసుకెళ్లి... రూమ్ బుక్ చేశాడు. హోటల్ ఓనర్ వచ్చి... ఇంటర్వ్యూ చేస్తాడని చెప్పి... ఆమెను రూంలో బంధించాడు.
చేతిలో మొబైల్ కూడా లేని ఆ యువతి... సంతోష్ కుమార్ చెప్పినట్లు హోటల్ ఓనర్ వస్తాడనీ... తనను ఇంటర్వ్యూ చేసి... ఉద్యోగం ఇస్తాడని అనుకుంది. ఉద్యోగం సంపాదించి ఈ విషయం తల్లికి చెప్పి... సర్ప్రైజ్ చెయ్యాలనుకుంది. కానీ... ఆమె ఆశలు కల్లలయ్యాయి. ఆ సంతోష్ కుమార్... ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చి రేప్ చేశాడు. అదంతా వీడియో తీసి... బ్లాక్మెయిల్ మొదలుపెట్టాడు. మళ్లీ మళ్లీ రేప్ చేస్తూ... ప్రతిసారీ బ్లాక్మెయిల్ చేస్తూ ఆమె జీవితంతో ఆడుకున్నాడు.
కూతురు కనిపించకపోవడంతో... తల్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. 2 నెలలుగా పోలీసులు బాధితురాలి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఐతే... హోటల్ పార్కిన్లో వ్యభిచారం జరుగుతోందని తనకు అనుమానంగా ఉంది అని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో మహిలా పోలీస్ స్టేషన్ పోలీసులు ఆ హోటల్‌పై రైడ్ చేశారు. దాంతో... బంధీగా ఉన్న యువతికి స్వేచ్ఛ లభించింది. బాధితురాలి తల్లి నుంచి కంప్లైంట్ తీసుకొని పోలీసులు... సంతోష్‌కుమార్‌ని అరెస్టు చేశారు.
ఈ కేసులో మరో విషయం తెలిసింది. హోటల్ యాజమాన్యం సహకారంతోనే సంతోష్ కుమార్ ఇదంతా చేసినట్లు తెలిసింది. హోటల్ యాజమాన్యం... ఆ హోటల్ని వ్యభిచార అడ్డాగా మార్చింది. సంతోష్ కుమార్ తెచ్చిన యువతిని... బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు 2 నెలలుగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. బాధితురాలు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో... ఒప్పుకునే దాకా ఆ గదిలోనే బంధించాలని ప్లాన్ వేసుకున్నారని తెలిసింది.
హోటల్‌ను మూసివేసిన పోలీసులు... హోటల్ మేనేజర్, వ్యభిచారం డీల్స్ కుదుర్చుతున్న ఓ మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో కొత్త విషయం తెలిసింది. హోటల్లోని ఓ రూంలో పోలీసులకు లిక్కర్ బాటిల్స్ దొరికాయి. వాటిని సీజ్ చేశారు. ఆ రూంలో ఓ జర్నలిస్టు ఉంటున్నాడు. అతనికి కూడా ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉంది అని తెలిసింది. దాంతో అతన్ని కూడా అరెస్టు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు ప్రద్యుమ్న నగర్ పోలీసులు.