ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చిక్‌బళ్లాపూర్‌లోని భగత్ సింగ్ నగర్‌లోని పుట్టింట్లోనే ఉంటోంది. సంగీత ఉంటున్న ఈ ఇల్లు అద్దె ఇల్లు కావడం గమనార్హం. అయితే.. కొన్నాళ్లకు ఈ క్రమంలోనే సంగీతకు హేమంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి రెండేళ్లు సహ జీవనం చేశారు.
అయితే.. మూడునాలుగు నెలల నుంచి హేమంత్ ప్రవర్తనలో సంగీత మార్పు గమనించింది. ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఆమెతో మాట్లాడాలంటేనే చిరాకు పడేవాడు. దీంతో.. సంగీత, హేమంత్ మధ్య గొడవలు తలెత్తాయి. ఈ గొడవలు కాస్తా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్లింది. తనను హేమంత్ బలవంతం చేస్తున్నాడని సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు అతనిని మందలించారు.
ఈ పరిణామంతో సంగీతపై పగ పెంచుకున్న హేమంత్ ఆమె ఇంటికి వెళ్లి అర్ధరాత్రి సమయంలో ఆమె స్కూటీని తగలబెట్టాడు. ఈ కేసులో.. హేమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు పంపారు. జైలు నుంచి నాలుగు రోజుల క్రితం విడుదలయిన హేమంత్ సంగీత ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అయితే.. ఆ సమయంలో సంగీతతో పాటు మరో యువకుడు చనువుగా ఉండటం చూసిన హేమంత్‌కు పట్టరాని కోపం వచ్చింది.