ముంబైలోని సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు... ఓ గ్యాంగ్‌ని పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ వ్యభిచార వృత్తిని సరికొత్తగా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్ టార్గెట్ డబ్బున్నవాళ్లు, సెలబ్రిటీలే. ఎలాగొలా వాళ్లతో బట్టలు ఊడదీయించడమే ఈ గ్యాంగ్ టార్గెట్. ఆ విషయంలో వీళ్లు సక్సెస్ అయ్యారు. చాలా మందిని నగ్నంగా నిలబెట్టేశారు. ఇదంతా ఎలా జరుగుతుందో చెప్పిన పోలీసులు... ఇప్పుడు క్రైమ్ కొత్తగా జరుగుతోందని తెలిపారు. (symbolic image)
కొంత మంది టీవీ నటులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. అసలీ క్రైమ్ ఎలా జరుగుతోందంటే... లైవ్ సెక్స్ వీడియోలను వీరు టార్గెట్ చేసిన వ్కక్తికి పంపుతున్నారు. వీడియోలో అమ్మాయి ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ... బట్టలు విప్పుతూ... నేను విప్పాను కదా... నువ్వు కూడా విప్పు అని కోరుతోంది. మళ్లీ మళ్లీ అలాగే కోరుతూ ఉంటుంది. కొంత మంది ఆమె విప్పింది కదా... మనమూ విప్పి చూపించాలి అని నగ్నంగా మొబైల్ ముందు నిలబడుతున్నారు. వెంటనే ఈ గ్యాంగ్... నగ్నంగా నిలబడిన దృశ్యాలను వీడియో రికార్డ్ చేస్తోంది. ఆ తర్వాత... లైవ్ వీడియో కట్ అవుతుంది. ఆ తర్వాత... ఆ బాధితుడికి కాల్... చేసి... అతని వీడియోని అతనికే చూపించి... బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలా లక్షలు కొల్లగొడుతున్నారు. (symbolic image)
పోలీసుల దర్యాప్తులో మరో విషయం కూడా తెలిసింది. ఈ గ్యాంగ్... వీడియో కాపీలను ట్విట్టర్లో కొందరికి అమ్ముతున్నారు. అలాగే.. డార్క్ నెట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో యాప్స్ వారికి అమ్ముతున్నట్లు తేలింది. పైగా వీళ్లు... ఏ సెలబ్రిటీ న్యూడ్ వీడియో కావాలో చెప్పండి... మేం ఇస్తాం అని ఆఫర్ కూడా ప్రకటిస్తున్నారు. ఆ రేంజ్లో ఈ తంతు జరుగుతోంది. (symbolic image)
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ గ్యాంగ్... నేపాల్‌లో ఓ బ్యాంక్ అకౌంట్ తెరిచింది. బాధితులకు డబ్బును ఆ అకౌంట్లో వెయ్యమని చెబుతోంది. ఇప్పుడు డబ్బంతా నేపాల్‌కి వెళ్లడంతో... అక్కడి అకౌంట్‌ను నిలిపివేయడం అంత ఈజీ కాదంటున్నారు పోలీసులు. ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఈ క్రైమ్ అన్ని మూలాల్నీ తెలుసుకొని... అంతటా క్లోజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. నేపాల్‌కి ప్రత్యేక పోలీస్ బృందాన్ని పంపి... డబ్బును వెనక్కి తెప్పిస్తామని చెబుతున్నారు. (symbolic image)