ఈ రోజుల్లో సోషల్ మీడియా (Social Media) యాప్స్, యూపీఐ యాప్స్ లేని స్మార్ట్‌ఫోన్ కనిపించడం చాలా అరుదు. అంతే తరచుగా సైబర్ మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని ఘటనలు జరుగుతున్నా, బ్యాంకులు, ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అప్రమత్తం చేస్తున్నా సైబర్ మోసగాళ్ల వలలో అవగాహన లేమితో ఎవరో ఒకరు చిక్కుకుంటూనే ఉన్నారు.
* 50,000 వేల మంది ఫాలోవర్లకు రూ.50 వేలు? : వాన్రాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తన తండ్రి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్నప్పుడు, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సోనాలి సింగ్ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఫాలో రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ ఫాలో రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేసింది. సోనాలి సింగ్‌తో చాట్ చేయడం ప్రారంభించింది.
* అకౌంట్ మొత్తం ఖాళీ : ఇందుకు ఒప్పుకున్న బాలికకు సోనాలి సింగ్ ఒక QR కోడ్‌ని సెండ్ చేసింది. ఆ బాలిక గూగుల్ పేని ఉపయోగించి రూ.600ని తన తండ్రి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. రూ.600 చెల్లిస్తే కేవలం 10,000 మంది ఫాలోవర్లు మాత్రమే వస్తారని, సోనాలి సింగ్ చెప్పింది. అయితే సోమవారం తన అకౌంట్ ఫాలోవర్లు పెరగలేదని బాలిక గమనించి, తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని సింగ్‌ను కోరింది.
బాలిక అకౌంట్లో ఏదో సమస్య ఉందని, డబ్బును తిరిగి సెండ్ చేయలేకపోతున్నట్లు సింగ్ చెప్పింది. ఆమె తండ్రి అకౌంట్లో ఉన్న మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే, రూ.600తో కలిపి పంపుతానని నమ్మించింది. ఈ మాటలు నమ్మిన బాలిక తండ్రి అకౌంట్లో ఉన్న మొత్తం రూ.55,128ని ఎనిమిదిసార్లు సోనాలి సింగ్ UPI ఐడీకి పంపింది.
* కేసు నమోదు చేసిన పోలీసులు : మంగళవారం యువతి తండ్రి ఫోన్‌ను పరిశీలించగా అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉంది. దీని గురించి బాలికను ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. తండ్రి వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక డబ్బు పంపిన UPI IDని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇండియన్ క్రిమినల్ కోడ్ సెక్షన్లు కింద చీటింగ్, వంచన కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.