బావిలోకి దూసుకెళ్లిన కారు.. భువనగిరిలో రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపుతప్పి ఓ కారు బావిలో పడింది. వేములకొండకి వెళ్లే దారి పల్లెర్ల స్టేజి సమీపంలో ఈ ఘటన జరిగింది. కారులో ఇద్దరు ప్రయాణికులు ఉండగా.. ఒకరిని స్థానికులు కాపాడారు. మరొకరిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.