కోల్కత్తా: వివాహేతర సంబంధాలు మాత్రమే కాదు అనుమానం కూడా పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మనుషులను నర హంతకులుగా మారుస్తోంది. భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ఓ మహిళను భార్య హతమార్చిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఘటన బెంగాల్లోని కొరెయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.