ఆ తర్వాత.. అదనపు కట్నంపై అయ్యగారికి గాలి మళ్లింది. పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురావాలని భార్యను వేధించేవాడు. అంతటితో ఆగలేదు. ఆమెతో శారీరకంగా కలిసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. చిన్నచిన్న విషయాలకు కూడా భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులు భరించలేక సదరు భార్య జనవరి 2020లో పుట్టింటికి వెళ్లిపోయింది.
తనతో కాపురం చేయకపోయినప్పటికీ వివాహ బంధాన్ని కాపాడుకునేందుకే మారతాడనే ఆశతో కలిసి ఉన్నానని, కానీ.. మారకపోగా శృంగారం చేసేందుకు నిరాకరించడమే కాకుండా చేద్దామని అడిగితే కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.