Vismaya: ఈ బంగారు తల్లి విస్మయ.. ఏ స్థితిలో చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం వరకట్న వేధింపులకు బలైన 22 ఏళ్ల యువతి ఘటన చర్చనీయాంశంగా మారింది. కుందనపు బొమ్మ లాంటి ఆ బంగారు తల్లిని అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధించి.. చిత్రహింసలకు గురిచేసి చివరకు ఆమె చావుకు కారణమైంది. సోమవారం ఉదయం (జూన్ 21న) అనుమానాస్పద స్థితిలో ఆ యువతి విగత జీవిగా కనిపించింది.