క్రికెటర్లు పెళ్లి కాలం నడుసస్తోంది. ఒకరి తర్వాత ఒకరు పెళ్లిలు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తో పాటు..పాకిస్తాన్ క్రికెటర్లు -షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హరీస్ రౌఫ్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా పెళ్లి చేసుకున్నాడు. Image Source Twitter User Saj Sadiq
షాహీన్ ఇతర పాక్ సహచరులతో పాటు తన మామ షాహీద్ అఫ్రిదితో కలిసి పోజులిచ్చాడు. కానీ వధువు ఫోటోలు మాత్రం బయటకు రావడం లేదు. అయితే ట్విట్టర్లో ఓ అభిమాని ఈ ఫొటోను ఎలాగోలా గుర్తించి పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో షాహీన్, అన్షా పెళ్లి తర్వాత కెమెరాల కోసం చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. Photo from Twitter User Maaham Khan