ఇప్పుడంటే అన్ని క్రీడల్లో ఆడాలని అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నారు కానీ 20 ఏళ్ల క్రితం వరకు ఆడవారికి ఆటలెందుకు అనే పదాలే ఎక్కువ మంది నోళ్ల నుంచి వినపడేవి. ముఖ్యంగా ఆ కాలంలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆటాడే అమ్మాయిలను చాలా విచిత్రంగా చూసేవారు. అలాంటి సమయంలో క్రికెట్ (Cricket) ఆటపై ప్రేమతో దాని దశా దిశా మార్చేసింది భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ (Mithali Raj).
ఈ స్టార్ క్రికెటర్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పింది. ఎందరో మహిళా క్రికెటర్లకు మార్గదర్శిగా మారిన మిథాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అందరూ బాధకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత విషయాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ముఖ్యంగా ఆమె పెళ్లి (Marriage) విషయం హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి మిథాలీరాజ్ వయసు 39 ఏళ్లు. అయినా ఆమెకింకా పెళ్లి కాలేదు. దీనితో మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.
27-30 ఏళ్ల తర్వాత మాత్రం పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ తానొకటి అబ్బాయిలందరూ క్రికెట్ మానేస్తేనే పెళ్లి చేసుకుంటామని షరతు పెట్టారు. అయితే క్రికెటే ప్రాణం కాబట్టి అన్ని సంబంధాలను మిథాలీ వదులుకుంది. చివరికి పెళ్ళంటేనే వైరాగ్యం వచ్చి సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకుంది. ఇలా మిథాలీ క్రికెట్ కెరీర్ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, పెళ్లిని త్యాగం చేసింది. పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు.
2013లో మిథాలీ మిథాలీ మాట్లాడుతూ... "నిజం చెప్పాలంటే, మేల్ క్రికెటర్లు తమ ఫిమేల్ ఫ్యాన్స్ నుంచి పొందే విధంగా నేను మేల్ ఫ్యాన్స్ నుంచి అటెన్షన్ పొందను. నేను ఇంతకు ముందు రిలేషన్షిప్స్లో ఉన్నాను కానీ ఇప్పుడు ఎవరితోనూ డేటింగ్లో లేను. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నా. ప్రపంచకప్‌లో బాగా ఆడటంపైనే నా దృష్టి ఉంది" అని వెల్లడించింది.
లేడీ సచిన్‌గా అభివర్ణించే మిథాలీ రాజ్ డిసెంబర్ 3, 1982లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పుట్టింది. హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడిన మిథాలీ రాజ్ ఎయిర్ ఇండియా, రైల్వేస్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది.