స్టేడియం నందు పర్యవేక్షణాధికారి గా డీసీపీ-1(ఎల్&ఓ) ,స్టేడియం వెలుపల పర్యవేక్షణాధికారిగా డీసీపీ-2(ఎల్&ఓ) , మొత్తం ట్రాఫిక్ పర్యవేక్షణాధికారిగా డీసీపీ(క్రైమ్స్) ఉండడం జరిగినది.▪️స్టేడియం వద్ద మూడు అంచల భద్రతతో పలు సెక్టార్లు గా విభజించి స్టేడియం లోపలా, వెలుపలా, చుట్టూ ఉన్న బహుళ అంతస్థుల పైన, రూఫ్ టాప్ లపైన పూర్తి భద్రత ఏర్పాటు చేసి, జనసమ్మర్ధం ఉండే ప్రతి చోటా ఎటువంటి అవాంతరాలు లేకుండా బందో బస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.
మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10:30 వరకు జరుగనుంది. స్టేడియం కెపాసిటీ 28,000 కాబట్టి 28,000 వేల మంది మధురవాడ క్రికెట్ స్టేడియంకు వస్తారు. అలాగే వారి వాహనాలు కూడా వేల సంఖ్యలో ఉంటాయి కాబట్టి మ్యాచ్ తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా, వేరే మార్గాలలో ప్రయాణించాలని సూచించారు.