సెలబ్రిటీలు ఎక్కువగా వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి, వెకేషన్ ట్రిప్ కోసం తమ సొంత ఊళ్లూ, అందమైన టూరిస్టు ప్రదేశాలకు వెళ్తుంటారు. అక్కడి తమ స్వీట్ మెమరీస్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. కాని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఎందుకంటే తన స్వస్థలం రాంచీలో విశాలమైన స్తలంలో ప్రకృతిని ఆస్వాదించే విధంగా తన ఇంటిని కట్టుకున్నాడు. ఆ బ్యూటిఫుల్ హౌస్ పేరే కైలాశపతి. (Photos:Instagram)
మహేంద్ర సింగ్ ధోనీ 2017లో రాంచీలో ఈ ఫామ్‌హౌస్‌ని నిర్మించుకున్నాడు. తన ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి సుమారు మూడేళ్లు పట్టింది. ఈ ఫామ్‌హౌస్ విలాసవంతంగా ఉండటమే కాదు.. చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా చెట్లు ఉంటాయి. ధోని ఈ ఫామ్ హౌస్ హర్ము రోడ్‌లోని అతని మొదటి ఇంటి నుండి 20 నిమిషాల దూరంలో ఉంది. అయితే, ధోని సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటాడు. కానీ ఈ ఫామ్‌హౌస్‌కి సంబంధించిన అనేక అందమైన చిత్రాలు అతని భార్య సాక్షి ధోని, కుమార్తె జివా ధోని ఇన్స్టాగ్రామ్ నుంచి సేకరించినవి. (Photos:Instagram)
ధోని 'కైలాశపతి'లో జిమ్, స్విమ్మింగ్ పూల్, పెద్ద లాన్‌తో పాటు అందమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఉన్నాయి. ఈ గార్డెన్లో ధోనీ కూతురు ఆడుకుంటున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంటాయి. ఫామ్‌హౌస్‌లోని గార్డెన్లో జీవాతో ధోనీ సరదాగా గడిపిన ఫోటోలను మిస్టర్ కూల్ వైఫ్ సాక్షి ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేస్తుంది.(Photos:Instagram)
రాంచీలోని ధోని ఫామ్ హౌస్‌లో ఇంటి బయట ప్రదేశం చూస్తే ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకెళ్తాయి. అంతే కాదు ప్రకృతి ఒడిలో కూర్చొని హాయిగా యోగా చేస్తున్న జీవా ధోని ఫోటోలు కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక టీమిండియా క్రికెటర్ ఫోటోలు కూడా ఎక్కువగా ఫామ్‌హౌస్‌లోని తోట పని చేస్తుండగా దిగినవే ఉంటాయి.(Photos:Instagram)
మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైక్‌లంటే ఎంతో ఇష్టం. అంతే కాదు వింటేజ్ కార్లతో పాటు సేకరించిన మరికొన్ని వాహనాలు ఆయన గ్యారేజ్‌లో కనిపిస్తూ ఉంటాయి. వీటి ఖరీదు కూడా కోట్ల రూపాయల ఖరీదు చేస్తాయి. కేవలం కార్లు, బైక్‌లు పెట్టుకోవడానికే తన ఫామ్ హౌస్‌లో కట్టించిన రెండు ఫ్లోర్లను గ్యారేజ్గా మార్చాడు. ((Photos:Instagram)
సాక్షి ధోనీ , జివా ధోనీ తరచుగా తమ పోనీ ఫోటోలు మరియు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటారు. ధోనికి కూడా తన పెంపుడు జంతువులను చాలా ప్రేమిస్తాడు. ధోనీ మరియు అతని కుటుంబం ఈ పెంపుడు జంతువులతో చాలా ఆడతారు మరియు సరదాగా కూడా ఉంటారు. అలాగే వాటిని బాగా చూసుకుంటారు. ధోనీ ఫామ్‌హౌస్‌లో విదేశీ జాతులకు చెందిన అనేక రంగుల చిలుకలు, మేకలు ఉన్నాయి.(Photos:Instagram)
ధోనీకి చెందిన ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ ప్రాంతం కూడా ఉంది, ఇక్కడ భారత మాజీ కెప్టెన్ తన తోటి ప్లేయర్లు, ఫ్రెండ్స్‌తో పార్టీలు కూడా చేసుకుంటారు. ఇక్కడే బార్బెక్యూ కోసం ప్రత్యేక స్థలం ఉంది. ధోనీకి చెందిన ఈ ఫామ్ హౌస్‌లో కిచెన్ గార్డెన్ కూడా ఉంది, అక్కడ సాక్షి రకరకాల కూరగాయలు, పండ్లను పండిస్తుంది.(Photos:Instagram)