HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
WORLD CORONA VIRUS CASE UPDATES BRITAIN AND RUSSIA PERMISSION FOR VACCINE AK
CoronaVirus: ఆ దేశాల్లో కరోనా విలయతాండవం.. వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64803583కు చేరుకోగా.. మరణాల సంఖ్య 1498190కు చేరుకుంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే దిశగా బ్రిటన్, రష్యా నిర్ణయం తీసుకున్నాయి.
News18 Telugu | December 3, 2020, 6:47 AM IST
1/ 7
ప్రపంచంలోని పలు దేశాలను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, లండన్, ఇటలీ, మెక్సికో వంటి దేశాల్లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64803583కు చేరుకోగా.. మరణాల సంఖ్య 1498190కు చేరుకుంది.
2/ 7
అమెరికాలో కొత్తగా 615172 కొత్త కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 2727 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో అగ్రరాజ్యంలో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 279763కు చేరుకుంది.
3/ 7
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 9533471కు చేరింది. కొత్తగా 33761 కరోనా కేసులు నమోదుకాగా.. 498 మంది వైరస్‌కు బలయ్యారు. తెలంగాణలో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 925 మంది కోలుకోగా.. మొత్తంగా ఈ సంఖ్య 2,60,155గా ఉంది.
4/ 7
తెలంగాణలో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 925 మంది కోలుకోగా.. మొత్తంగా ఈ సంఖ్య 2,60,155గా ఉంది.
5/ 7
ఏపీలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తగ్గుతోంది. కొత్తగా 56,988 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 663 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,69,412కి చేరింది.
6/ 7
మరోవైపు కరోనా విజృంభణ నేపథ్యంలో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ వాడకానికి సంబంధించి అత్యవసర అనుమతి ఇచ్చింది. దీంతో బ్రిటన్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
7/ 7
రష్యా సైతం ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వీ మాస్ వ్యాక్సినేషన్ని(సామూహిక టీకా కార్యక్రమం) ప్రారంభించాలని నిర్ణయించింది. బ్రిటన్ నిర్ణయం వెల్లడించిన గంటల వ్యవధిలోనే రష్యా ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.