ఉద్యోగాలు , పార్ట్ టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్" width="1200" height="800" /> స్టాంటన్ చేస్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన మాలా చావ్లా మాట్లాడుతూ.. దేశంలో నియమకాలు తగ్గినప్పుడు కరోనా వార్త బయటకు వచ్చిందని, హాస్పిటల్, టూరిజం రంగాల్లో క్లయింట్లు జాగ్రత్తగా ఉన్నారని, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్జ్యూమర్ రంగాల్లో నియామకాలు మాత్రం ఆగలేదని తెలిపారు. నివేదిక ప్రకారం పశ్చిమ దేశాల్లో ఆర్థిక మాంద్యం కారణంగా కొత్త నియామకాలు ప్రభావితం అయ్యాయని, గత సంవత్సరం లాగా ఉండకపోవచ్చని చెప్పారు. క్లయింట్లు పూర్తిగా జాగ్రత్త పడుతున్నారని కానీ వారికి ఇండియా గురించి తెలుసు అని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో 196 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 3428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.46 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మొత్తం 5,30,695 మరణాలు నమోదయ్యాయి. ప్రతిరోజు పెరిగే కేసుల సంఖ్య 0.56 శాతంగా ఉంది. వారంలో కేసుల సంఖ్య 0.16 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)