HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
WHICH PEOPLE SHOULD NOT GET THE COVISHIELD VACCINE SII RELEASES FACT SHEET SK
Covishield: ముఖ్య గమనిక.. ఈ లక్షణాలుంటే మా టీకా వేసుకోవద్దు.. సీరం ప్రకటన
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు టీకాలు వేస్తున్నారు. ఐతే టీకా తీసుకున్న వారలో కొందరికి అలర్జీలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. టీకా తయారీలో ఎలాంటి పదార్థాలు వినియోగించారు? ఎవరు టీకాలు వేసుకోవాలి? ఎవరు వేసుకోవద్దో స్పష్టంచేసింది.
News18 Telugu | January 20, 2021, 10:22 AM IST
1/ 8
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు టీకాలు వేస్తున్నారు. ఐతే టీకా తీసుకున్న వారలో కొందరికి అలర్జీలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. టీకా తయారీలో ఎలాంటి పదార్థాలు వినియోగించారు? ఎవరు టీకాలు వేసుకోవాలి? ఎవరు వేసుకోవద్దో స్పష్టంచేసింది.
2/ 8
కొవిషీల్డ్ టీకా తయారీలో వినియోగించిన పదార్థాల వల్ల కొందరికి అలర్జీ వచ్చే అవకాశం ఉందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అలర్జీ వచ్చే ప్రమాదం ఉన్నవారు, ఈ టీకా తీసుకోవద్దని ప్రకటన విడుదల చేసింది.
3/ 8
కొవిషీల్డ్ టీకాలో ఎల్-హిస్టిడైన్, ఎల్-హిస్టిడైన్ హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్, మెగ్నీషియమ్ క్లోరైడ్ హెగ్జాహైడ్రేట్, పాలీసోర్బేట్ 80, ఇథనాల్, సుక్రోజ్, సోడియమ్ క్లోరైడ్, డైసోడియమ్ ఎడెటేట్ డైహైడ్రేట్ (ETDA),నీరు ఉన్నాయి.
4/ 8
ఇవి పడని వారు, అలర్జీ లేదా ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నవారు కొవిషీల్డ్ టీకా తీసుకోవద్దని కోరుతూ ఒక ‘ఫ్యాక్ట్ షీట్’ను సీరం ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది.
5/ 8
ఈ టీకా తీసుకునే ముందు ప్రతిఒక్కరు తమ ఆరోగ్య స్థితిగతుల సమాచారాన్ని తెలియజేయాలని, అంతేగాక జ్వరం, రక్తస్రావం ముప్పు ఉన్నా, రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నా.. ఆ విషయాలను వెల్లడించాలని సూచించింది.
6/ 8
జ్వరం ఉన్నా, బ్లీడింగ్ సమస్యలు ఉన్నా కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకోవద్దు. మందులు, ఆహారం లేదా ఇతర కారణాలతో అలర్జీ వచ్చే సమస్య ఉంటే ఈ టీకా తీసుకోకపోవడం మంచింది.
7/ 8
మొదటి కోవిషీల్డ్ డోస్ తీసుకున్న తర్వాత అలర్జీ వస్తే.. రెండో టీకా అస్సలు తీసుకోకండి. గర్భిణీలు, పాలిచ్చే తల్లలు కూడా కోవిడ్ టీకాకు దూరంగా ఉండాలి.
8/ 8
వేరొక కంపెనీకి చెందిన వ్యాక్సిన్ను తీసుకున్న వ్యక్తులు.. మళ్లీ కోవిషీల్డ్ టీకాను వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. టీకా వేసుకోవాలని భావిస్తున్న వారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవం మంచింది.